News December 14, 2025
ఈ నెల 20న కొత్త సర్పంచ్‌లకు బాధ్యతలు

TG: పంచాయతీ ఎలక్షన్స్‌లో ఎన్నికైన కొత్త సర్పంచ్‌లు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతల్లో ఎన్నికైన వారు ఒకేసారి ప్రమాణం స్వీకారం చేసేలా అపాయింట్‌మెంట్ డేను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ గెజిట్ జారీ చేసింది. ఆ రోజు నుంచి 12,700 గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టాక పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరనుంది.
Similar News
News December 14, 2025
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News December 14, 2025
ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. #SkinCare
News December 14, 2025
బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.


