News December 20, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

జాతీయ స్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన అన్ని కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కల మందు వేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
ప్రోటోకాల్ రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వరుస అవమానాలు

KNR(D)లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో MLA కవ్వంపల్లి సత్యనారాయణను విస్మరిస్తూ తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆహ్వానం అందకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడం వివాదాస్పదమైంది. గతంలో సన్నబియ్యం పంపిణీ, గణేశ్ మండపాల విద్యుత్ ఫ్లెక్సీల్లోనూ ఇదేతీరు పునరావృతమైంది. అధికారుల వివక్షపై కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.
News December 25, 2025
ADB: ఆన్‌లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

ఆన్‌లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్‌లైన్ ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 25, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


