News December 20, 2025
ఈ నెల 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ

AP: సివిల్, APSP విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 21వ తేదీ తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఇటీవల వీరికి CM నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 29, 2025
ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

<
News December 29, 2025
శీతాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా రోగాలబారిన పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు పరిశుభ్రత పాటించడం, నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. వీటితో పాటు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్ వంటి పోషకాహారాన్ని వారి ఆహారంలో చేర్చాలి. జంక్ ఫుడ్‌ను నివారించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
‘పెద్ది’లో జగపతిబాబు షాకింగ్ లుక్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చూసిన వెంటనే గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ‘అప్పలసూరి’ అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.


