News December 24, 2025
ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విషయమై ఎవ్వరైనా విజ్ఞాపనలు చేసుకోవచ్చన్నారు. సంబంధిత అర్జీలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, న్యాయం చేస్తారన్నారు.
Similar News
News December 27, 2025
శ్రీకాకుళం ఎంపీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరును శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ ప్రతిపాదించింది. జేసీఐ బృంద సభ్యులు జేసి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. అవార్డును భారతదేశంలో ఉన్నత స్థానంలో ఉండి, తమ తమ రంగాలలో విశేషమైన సేవలు, కృషి చేసి 40 సంవత్సరాలలోపు ఉన్న యువ నాయకులకు మాత్రమే ప్రదానం చేయబడుతుందన్నారు.
News December 27, 2025
శ్రీకాకుళం: B.tech చదవి నకిలీ డాక్టర్ అవతారం

విశాఖ KGHలో డాక్టర్‌గా నమ్మించి కిడ్నీ బాధితుడి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన <<18678274>>నిందితుడిని<<>> వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన బాధితుడు తన కుమారుడి చికిత్స కోసం ప్రకటన ఇవ్వగా, నిందితుడు జ్యోతి శివశ్రీ ‘డాక్టర్ నరసింహం’గా పరిచయం చేసుకుని మోసగించాడు. బి.టెక్ చదివి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతనిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
News December 27, 2025
శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.


