News October 26, 2025
ఈ నెల 27న ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.
News October 26, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ADB SP

సైబర్ నేరాలు ఎన్నో రకాలుగా జరుగుతూ ప్రజల ఆర్థిక నష్టాలకు కారణమవుతున్న సందర్భంగా ప్రజలకు అప్రమత్తతో వ్యవహరించడం తప్పనిసరిగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గతవారం జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి 29 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ కు గురైన వెంటనే 1930 కి సంప్రదించాలని సూచించారు.
News October 25, 2025
రైతులకు నష్టం జరగకుండా పటిష్ట చర్యలు: కలెక్టర్

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజార్షిషా తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 27, 2025 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రైతులకు ఎంఎస్‌పీ (MSP) ధర లభించేలా CCI కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.


