News March 24, 2025
ఈ నెల 27న విజయవాడలో ముస్లింసోదరులకు ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోదరులకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
Similar News
News March 29, 2025
MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News March 29, 2025
MBNR: నేషనల్ ఖో-ఖో జట్టుకు ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా నుంచి 57వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్-2024-25కు మంగలి శ్రీలక్ష్మి, కే.శ్వేత, ఎరుకలి శశిరేఖ ఎంపికయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖోఖో మహిళా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒడిశాలో ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంతో ఎంపికైన క్రీడాకారులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లా నేతలు, తదితరులు అభినందించారు. CONGRATULATIONS❤
News March 29, 2025
భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మహిళ హత్య కేసును ఛేదించారు

ఈనెల 26న జరిగిన భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జనగామ చెందిన కనకరాజు అనే వ్యక్తి ఆ మహిళతో శారీరకంగా కలిసిన తర్వాత కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.