News February 25, 2026

ఈ నెల 28న టీయూలో జాతీయ సెమినార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (లండన్) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించనున్నట్లు డా.వాసం చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ సెమినార్ పోస్టర్లను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం ఆవిష్కరించారు. రసాయన, జీవ రసాయన పురోగతిపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొ.రాంబాబు, ప్రొ.ఆంజనేయులు, డా.సాయిలు పాల్గొన్నారు.

Similar News

News February 27, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు: కృష్ణా SP
* ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను పరామర్శించిన లక్ష్మీపార్వతి
* ఆయేషా మీరా కేసులో న్యాయం జరగలేదని పేరెంట్స్ ఆవేదన
* మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు నుంచి కాపాడిన పోలీసులు
* CRDA కార్యాలయంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
* బాపులపాడు డిప్యూటీ MPDOపై సస్పెన్షన్ వేటు
* గన్నవరం ఎయిర్పోర్ట్‌లో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

News February 27, 2026

GWL: రైతులను ముంచిన గుంటూరు కోల్డ్ స్టోరేజ్ యజమాని

image

గుంటూరు‌లోని కోల్డ్ స్టోరేజ్ యజమాని గద్వాల రైతులను నిలువునా ముంచాడు. స్థానిక లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో రైతులు భద్రపరుచుకున్న సుమారు 1850 బస్తాల మిర్చిని యజమాని అక్రమంగా విక్రయించేశాడు. తమ పంట మాయమవడంతో రైతులు గత నెల రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కష్టార్జితాన్ని ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

News February 27, 2026

స్వాతంత్ర్యం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు: ప్రధాని మోదీ

image

ఒకప్పుడు ఫారిన్ టెక్నిక్స్ కాపీ కొట్టే దుస్థితిలో భారత్ ఉండేదని ప్రధాని మోదీ రైజింగ్ భారత్ సమ్మిట్‌లో తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినా చాలా కాలం దేశంలో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. ఇప్పుడు తన శక్తి ఏంటో తెలుసుకొని దాని నుంచి బయటపడి అగ్రరాజ్యాలతో ట్రేడ్ డీల్స్ చేసుకునే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ జరుపుకోవడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.