News February 25, 2025

ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత: ASF కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆర్థిక అవగాహన కలిగి ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం ఎస్బీఐ నిర్వహించిన మహిళా ఉద్యోగుల ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. RBI 2016 నుంచి ప్రతి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు ఉన్నారు.

Similar News

News November 13, 2025

నేటి నుంచే అరకు-యెలహంకా ప్రత్యేక ట్రైన్లు

image

నేటీ నుంచే దువ్వాడ మీదుగా అరకు-యెలహంకా మధ్య స్పెషల్ ట్రైన్‌లు (08551/08552), (08555/08556) నడవనున్నాయి. ఈనెల 13, 17, 23, 24 తేదీల్లో అరకు నుంచి మ.12కి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగుపయనం ఈనెల 14, 24, తేదీల్లో యెలహంకా నుంచి మ.1.30 గంటకి, అదేవిధంగా 18, 25 తేదీల్లో యలహంక నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.

News November 13, 2025

భీమేశ్వరాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.