News January 24, 2026

ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’

image

యంగ్ హీరో రోషన్ నటించిన ‘ఛాంపియన్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix ప్రకటించింది. మూవీలో రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్ నటించారు. స్వప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన మూవీ DEC 25న రిలీజైన విషయం తెలిసిందే. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘గిరగిర’ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

Similar News

News February 5, 2026

RAC ప్యాసింజర్ల నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు కరెక్ట్ కాదు: కమిటీ

image

RAC టికెట్‌‌పై ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయడం కరెక్ట్ కాదని పార్లమెంటరీ కమిటీ చెప్పింది. భారతీయ రైల్వేలలో సమయపాలన, ప్రయాణ సమయం, ఆపరేషన్లపై ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఛార్ట్ ప్రిపరేషన్ తర్వాత RACలో ఉండి, ఫుల్ బెర్త్ కేటాయించని ప్యాసింజర్లకు కొంత రిఫండ్ ఇచ్చే మెకానిజం తేవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సూచించింది. ఒకే బెర్త్‌కు ఇద్దరి నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయకూడదని తెలిపింది.

News February 5, 2026

కాంగ్రెస్‌కు విజన్ లేదు.. ప్లాన్ లేదు: మోదీ

image

గత పాలకులు చేసిన తప్పులను సరిచేయడంపై తాము దృష్టి పెట్టామని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు ఐడియా, విజన్, ప్లాన్ లేవని విమర్శించారు. గతంలో ఏదైనా ఒప్పందం గురించి మాట్లాడితే.. ప్రజలు బోఫోర్స్ గురించే ప్రస్తావించే వారని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కీలక సంస్థలను బలహీనపరిచాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లు దేశం బాధపడాల్సి వచ్చిందని అన్నారు.

News February 5, 2026

పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

image

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.