News January 1, 2026

ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

image

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.

Similar News

News February 20, 2026

పి.గన్నవరం: అనుమానాస్పద స్థితిలో టెన్త్ విద్యార్థిని మృతి

image

ముంగండ ZPH స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 20, 2026

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

image

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.

News February 20, 2026

సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

image

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.