News August 28, 2025

ఈ నెల 30న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. అపోలో ఫార్మసీ, టాటా ఏఐఏ, న్యూ ఇన్నోలెర్న్ సంస్థల్లో 123 ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు గల టెన్త్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.

Similar News

News August 29, 2025

యువత దరఖాస్తు చేసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్

image

ఏటీసీ సెంటర్లలో శిక్షణ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. తాండూర్, మోమిన్‌పేట్, వికారాబాద్ ఏటీసీ సెంటర్లలో కోర్సులు ప్రారంభం కానున్నందున గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటీసీ సెంటర్లలో శిక్షణ పొందితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు.

News August 29, 2025

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. మరొకరు అరెస్ట్

image

AP: విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అరెస్టయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు NIA వెల్లడించింది. గతంలో <<16451593>>అరెస్టైన <<>>నిందితులు సమీర్, సిరాజ్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలున్నాయని గుర్తించింది. వీరంతా కలిసి ఉగ్రదాడులకు కుట్ర పన్నారని, జిహాదీ కార్యక్రమాల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించినట్లు NIA తెలిపింది.

News August 29, 2025

సంగారెడ్డిలో హెల్ప్‌లైన్ నంబరం 08455- 276155

image

సంగారెడ్డి కలెక్టరేట్‌లో అత్యవసర సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణ సహాయం కోసం అత్యవసర నంబర్ 08455 – 276155 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలతో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఫోన్ చేయవచ్చని, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని కలెక్టర్ సూచించారు.