News March 29, 2025
ఈ నెల 31న రంజాన్ సందర్భగా గ్రీవెన్స్ రద్దు: VZM SP

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవుగా ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రిసల్ సిస్టం’ను రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంకు మార్చి 31న ప్రజలెవరూ రావద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Similar News
News March 31, 2025
జామి: ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గొర్రెల కాపరి మృతి

జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలో పడి అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వారధి కృష్ణ చనిపోయాడు స్థానికులు తెలిపారు. మృతుడు ఆదివారం నుంచి కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో స్థానికులు గెడ్డలో శవం ఉన్నట్లు తెలిసి వెళ్లి చూడగా అతను వారధి కృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
News March 31, 2025
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.
News March 31, 2025
బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.