News March 23, 2025
ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.
Similar News
News September 27, 2025
వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.
News September 27, 2025
VZM: రేపటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వయం సహాయక సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలవనుందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. తన ఛాంబర్‌లో మీడియాతో శనివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మనందరికీ అందుబాటులో విజయనగరంలో ప్రారంభంకానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News September 27, 2025
VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 4, విజయనగరంలో 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.