News April 1, 2026

ఈ నెల 5న బేస్ బాల్ ఎంపిక పోటీలు

image

ఈనెల 5న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బేస్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రమణయ్య తెలిపారు. 01/01/2010 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మే మొదటి వారం కర్నూలు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 9010775080 నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.

Similar News

News April 4, 2026

డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

image

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

News April 4, 2026

సూర్యఘర్ ఉత్సవ్‌కు శ్రీకారం: సీఎండీ

image

ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. 25 వేల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

News April 4, 2026

కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

image

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.