News January 20, 2026
ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.
Similar News
News April 14, 2026
ఆస్ట్రేలియాలో ఐపీఎల్.. ఇండియాలో BBL?

IPL-2027లో ఒక మ్యాచును AUSలోని అడిలైడ్ ఓవల్ స్టేడియం హోస్ట్ చేసే అవకాశముంది. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మ్యాచుకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందని స్టేడియం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే AUSలో జరిగే ‘బిగ్‌బాష్ లీగ్’ మ్యాచునూ INDలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చెన్నై స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు టాక్. త్వరలోనే BCCIతో దీనిపై చర్చలు జరిగే ఛాన్సుంది.
News April 14, 2026
హోటల్ బిల్లులు చెల్లించలేక పాక్ అభాసుపాలు

US-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ అందుకు వేదికైన హోటల్‌కు బిల్లులు చెల్లించలేక అభాసుపాలైంది. ఈనెల 10-12 తేదీల్లో ఇస్లామాబాద్‌లోని సెరీనా హోటల్లో 2దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే ఆ బిల్లులు ప్రభుత్వం కట్టకపోవడంతో చివరకు ఆ హోటల్ యజమానే దాన్ని భరించాల్సి వచ్చింది. ఈ హోటల్‌లో ప్రెసిడెంట్ సూట్ ధర ఒక రాత్రికి ₹2.21లక్షలు కాగా స్టాండర్డ్ రూమ్స్ ₹14,896/నైట్ ఉన్నట్లు సమాచారం.
News April 14, 2026
వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్

NHలపై ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కేంద్రం రేపటి నుంచి కొత్త టోల్ రూల్ అమలు చేయనుంది. పరిమితికి మించి వాహనం మోసుకెళ్లే అదనపు బరువును బట్టి ఫైన్ విధించనుంది. ఓవర్ లోడ్ 10%లోపు ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. 10-40% ఉంటే సాధారణ టోల్ రేటుకు 2 రెట్లు, 40%+ ఉంటే 4 రెట్లు ఎక్కువగా చెల్లించాలి. కేవలం ఫాస్టాగ్ ద్వారా దీనిని వసూలు చేస్తారు. టోల్ ప్లాజా వద్ద బరువును కొలిచే మెషీన్లు లేకపోతే ఫైన్ ఉండదు.


