News January 2, 2026
ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News January 6, 2026
ఆధార్ PVC కార్డు ధర పెంచిన UIDAI

ఆధార్ PVC కార్డు ధరలు పెంచినట్టు UIDAI తెలిపింది. మైఆధార్ పోర్టల్/maadhaar మొబైల్ యాప్ నుంచి అప్లై చేసుకునే యూజర్ల నుంచి ట్యాక్స్‌లతో కలిపి రూ.75 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు రూ.50గా ఉన్న ఛార్జీని పెంచామని, జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయని చెప్పింది. పీవీసీ కార్డు తయారీ, ప్రింట్, డెలివరీ, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిన కారణంగా ఛార్జీలు పెంచినట్టు తెలిపింది.
News January 6, 2026
సంక్రాంతి సెలవులు.. ఇంటికి వెళ్లాలంటే చుక్కలే..

సంక్రాంతి సెలవుల్లో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేలోని బ్లాక్ స్పాట్ల వద్ద రిపేర్లు చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా LB నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు భారీగా ట్రాఫిక్ ఆగిపోతోంది. విజయవాడకు వెళ్లాలంటే 8 గంటల సమయం పడుతోంది. దీంతో నార్కట్‌పల్లి నుంచి ట్రాఫిక్ మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
News January 6, 2026
బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

సీనియర్ నటి రాధిక నందమూరి బాలకృష్ణ అభిమానిగా అవతారమెత్తారు. ఇదేంటి సడన్‌గా అనుకుంటున్నారా? శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంలో ఆమె బాలయ్య అభిమానిగా కనిపించనున్నారు. ఈ మేరకు మూవీలోని లుక్‌ను రాధిక ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘జై బాలయ్య’ అని ఉన్న హెడ్ బ్యాండ్‌ను ఆమె ధరించారు. వెనకాల బాలకృష్ణ నటించిన ‘టాప్ హీరో’ పోస్టర్ ఉంది. ఇటీవల వృద్ధ మహిళ <<18664403>>లుక్<<>>తోనూ రాధిక సర్‌ప్రైజ్ చేశారు.


