News January 3, 2026
ఈ మాస్క్‌తో చిట్లిన చివర్లకు చెక్

ఇంట్లో మనం సహజంగా తయారు చేసుకునే మాస్క్‌ల వల్ల జుట్టు డ్యామేజ్‌ని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చిట్లిన జుట్టు చివర్లకు గుడ్డు, ఆలివ్ ఆయిల్ మాస్క్ ఉపయోగపడుతుందంటున్నారు. ఒక గుడ్డులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేయాలి. ఈ మాస్క్ జుట్టుకు నేచురల్‌గా మెరుపు అందిస్తుంది.
Similar News
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
News January 23, 2026
ఒక్క బంతికే 11 రన్స్

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.
News January 23, 2026
భర్తను చంపిన భార్య.. కీలక విషయాలు

AP: గుంటూరు(D) దుగ్గిరాలలో భర్తను భార్య చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూసిన <<18921625>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగరాజే తనకు పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేశాడని విచారణలో భార్య మాధురి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక తన బిడ్డ అలా చేసుండదని, ఆమెను ఘోరంగా అవమానిస్తున్నారని మాధురి తల్లి బీబీసీ వద్ద వాపోయారు. కాగా ప్రియుడు గోపీతో కలిసి భర్త నాగరాజును మాధురి హత్య చేసినట్లు కేసు నమోదైంది.


