News December 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 21, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 23, 2025
తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.
News December 23, 2025
విద్యుత్ ఛార్జీలు తగ్గించండి… ఇరిగేషన్ శాఖ లేఖ

TG: ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరఫరా అయ్యే విద్యుత్‌పై అదనపు ఛార్జీలను తగ్గించాలని ఇరిగేషన్ శాఖ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. నెలకు KVAకు ₹300 చొప్పున వసూలు చేయడాన్ని ఆపాలంది. యూనిట్ విద్యుత్‌కు వసూలు చేస్తున్న ₹6.30 సుంకాన్నీ తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లోడ్ 2819.80 MWగా ఉంది. 2026లో ఇది 7348 MWకు చేరుతుందని అంచనా.
News December 23, 2025
ఇదే లాస్ట్ ఛాన్స్: అక్రమ వలసదారులకు US వార్నింగ్

అక్రమ వలసదారులు ఏడాది చివరికి స్వచ్ఛందంగా దేశాన్ని వీడేందుకు రిజిస్టర్ చేసుకుంటే 3వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటివరకు చెల్లించే వెయ్యి డాలర్లను $3వేలకు పెంచింది. దేశాన్ని వీడేందుకు వారికి ఇదే చివరి అవకాశమని, తర్వాత అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


