News December 26, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 26, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.07 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

Similar News

News January 1, 2026

సంతానోత్పత్తి తగ్గి కొరియాలో స్కూళ్ల మూత

image

పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతుండడం సాధారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది షరా మామూలైంది. అయితే మన దగ్గర సదుపాయాలు, టీచర్ల లేమి, ప్రైవేటు స్కూళ్ల పోటీ కారణమైతే అక్కడ సంతానోత్పత్తి తగ్గడం దీనికి కారణం. దక్షిణ కొరియాలో గత కొన్నేళ్లలో 4008 GOVT స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో 3674 స్కూళ్లు ఎలిమెంటరీయే. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు 0.7కు పడిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఇదే అత్యల్పం.

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

image

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్‌లో 928, ఫ్యూచర్ సిటీ‌లో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్‌గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.