News February 7, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 07, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.38 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.28 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 23, 2026
రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్‌సైజ్ చేసినా వేస్ట్!

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ప్రాణాంతకమని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రోజుకు 8గంటల కంటే ఎక్కువ కూర్చుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ముప్పు 20% పెరుగుతుంది. ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేసినా, రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని అది భర్తీ చేయలేదు. దీనివల్ల బ్లడ్ ఫ్లో మందగించి కొవ్వు పేరుకుపోతుంది. ప్రతి 30నిమిషాలకోసారి సీటు నుంచి లేచి కాసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది.
News February 23, 2026
మేం హిందుత్వ రాజకీయాలు చేయం: భాగవత్

RSS హిందుత్వ రాజకీయాలు చేయదని, కేవలం వ్యక్తి నిర్మాణంతో సమాజం, దేశాభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. శక్తిమంతమైన వ్యక్తులే బలమైన సమాజాన్ని నిర్మించగలరని, అందుకే వ్యక్తి వికాసమే తమ లక్ష్యమని డెహ్రాడూన్‌లో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడారు. సంఘ్ వాస్తవ రూపాన్ని బయటి నుంచి చూసి అర్థం చేసుకోలేమని, ఆ లోతును గ్రహించాలంటే లోపల ఉండి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.
News February 23, 2026
80 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2026కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(BZC, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, Engg., ఎనిమల్ హజ్బెండరీ& వెటర్నరీ సైన్స్) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 32ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.upsc.gov.in


