News January 26, 2025

ఈ-శ్రమ్ పోర్టల్ నమోదు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ప్రతి ఒక్కరిని ఈ-శ్రమ్ పోర్టల్ నందు మార్చి 31 తేదీ లోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ హాలులో శనివారం అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్  పోర్టల్ నమోదు కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

Similar News

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.

News September 19, 2025

HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

image

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.

News September 19, 2025

నెల్లూరు: ఏడుగురి మృతి.. ముగ్గురిపై కేసు

image

సంగం మండలం పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు చనిపోయిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏ1గా టిప్పర్ డ్రైవర్, ఏ2గా టిప్పర్ యజమానిని, ఏ3గా బుజ్జినాయుడు పేర్లు నమోదు చేశారు. బుజ్జినాయుడిని ఇసుక వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇసుకను ఆత్మకూరు వైపు నుంచి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పరిధిలో ప్రస్తుతం ఏ ఇసుక రీచ్‌కు అనుమతులు లేకపోవడం గమనార్హం.