News December 30, 2025

ఈ సమస్యలుంటే ఉపవాసం చెయ్యకూడదు

image

ఉపవాసం మంచిదే అయినా గుండె జ‌బ్బులు ఉన్న‌వారికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగే బీపీ, కొరోన‌రీ ఆర్ట‌రీ వ్యాధులు, అరిథ్మియా స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఉప‌వాసం చేస్తే చ‌క్కెర స్థాయిలు, ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తుల్య‌త‌, నీటి శాతం త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. బీటా బ్లాక‌ర్స్, యాంటీ అరిథ‌మిక్స్, బ్ల‌డ్ థిన్న‌ర్స్ వాడుతుంటే ఆహారంతో పాటు సమయానికి మందుల‌ను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.

Similar News

News January 10, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.

News January 10, 2026

నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

image

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

News January 10, 2026

బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

image

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్‌తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.