News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
Similar News
News March 29, 2026
MEGA158.. ఊర మాస్ లుక్‌లో చిరు?

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా(MEGA158) షూటింగ్ APR 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మూవీ ఉంటుందని, ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురుగా అనశ్వరా రాజన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.
News March 29, 2026
అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.
News March 29, 2026
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.


