News November 19, 2025

ఈ హెయిర్ ‌స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

image

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్​స్టైల్స్​ ప్రయత్నించాలని సూచించారు.

Similar News

News March 7, 2026

డిజిటల్ ఫ్రాడ్‌కు ₹25,000 పరిహారం!

image

₹50,000 లోపు సైబర్ మోసం జరిగితే కస్టమర్ పొరపాటు ఉన్నా ఒకేసారి గరిష్ఠంగా ₹25,000 వరకు పరిహారం అందించేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5 రోజుల్లోపు కంప్లైంట్ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. APR 6 వరకు ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు అభిప్రాయం తెలియజేయొచ్చు. ఇవన్నీ ఓకే అయితే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సామాన్య కస్టమర్ల కష్టార్జితానికి రక్షణ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.

News March 7, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 7, 2026

ఖమేనీ పాలనలో దిగజారిన ఇరాన్ ప్రతిష్ఠ

image

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభం ముదిరింది. 1981 నుంచి అధికారంలో ఉన్న ఆయన పాలనలో ఆ దేశం అంతర్జాతీయ సూచీల్లో అట్టడుగుకు పడిపోయింది. 2025 అవినీతి సూచీలో 153వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 176వ స్థానంతో దారుణమైన స్థితికి చేరింది. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల విషయంలోనూ నిరంకుశ పాలనలోనే ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. సుదీర్ఘ రాజకీయ స్థిరత్వం ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో ఖమేనీ విఫలమయ్యారు.