News February 7, 2026

ఈ 3 దేశాల్లో ఇంటర్నెట్ ఉన్నా లేనట్టే!

image

EAలోని ఎరిట్రియా, N.కొరియా, CAలోని తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల్లో ఇంటర్నెట్ లిమిటెడ్‌గా ఉంటుంది. భద్రతా కారణాలతో టెలికాంలపై ఎరిట్రియా, N.కొరియా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎరిట్రియాలో ప్రభుత్వ పర్యవేక్షణలోని కెఫేలపై పౌరులు ఆధారపడతారు. నా.కొరియాలో SM వాడటంపై నిషేధం. తుర్క్‌మెనిస్తాన్‌లో SM, వార్తలు, ఫారిన్ సైట్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. VPNల సపోర్ట్‌తో వాడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Similar News

News February 13, 2026

కవితకు షాక్.. మాకు జాగృతికి సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీనివాస్

image

TG: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని, ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని ఛైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు.

News February 13, 2026

మహా శివరాత్రి ప్రత్యేక రుద్రహోమం

image

గ్రహ, దృష్టి దోషాలతో బాధ పడుతున్నారా? అనారోగ్యం వేధిస్తోందా? అయితే మహా శివరాత్రి నాడు చేసే రుద్ర హోమం మీకు వీటి నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ పూజ ద్వారా మీ శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. కెరీర్‌లో ఆటంకాలు లేకుండా ముందుకు సాగవచ్చు. గణపతి పూజ, కుంభ స్థాపన, నవగ్రహ స్థాపనతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను మీకు పంపుతాం. పేరు, గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.

News February 13, 2026

విజయ్-రష్మిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు ₹60 కోట్ల ఆఫర్?

image

టాలీవుడ్ క్రేజీ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఈ నెల 26న జరగనుందని SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి మ్యారేజ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹60 కోట్లు ఆఫర్ చేయగా.. ఈ జంట నో చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార, విఘ్నేశ్‌ పెళ్లి డాక్యుమెంటరీకి ఇదే OTT ప్లాట్‌ఫామ్ ₹25 కోట్లు చెల్లించగా వివాదమైంది.