News December 9, 2025
ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.
Similar News
News December 15, 2025
వరంగల్: చిన్నారి, వృద్ధురాలిపై వీధి కుక్క దాడి

జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం 40వ డివిజన్‌లో ఉర్సు ప్రాంతంలో వీధి కుక్క రెచ్చిపోయింది. పిచ్చి కుక్క దాడిలో చిన్నారి, వృద్ధురాలు గాయపడ్డారు. బాధితులను స్థానికులు అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
News December 15, 2025
KMM: వెంకటాపురంలో తండ్రిపై కొడుకుదే పై‘చేయి’

ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసాధారణ పరిస్థితి నెలకొంది. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తండ్రి రాయల వెంకటేశ్వర్లు సీపీఎం తరఫున సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందుల బాలచందర్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. బాలచందర్ 130 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 15, 2025
‘ఉపాధి హామీ’ చట్టం రద్దుకు కేంద్రం బిల్లు!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) కేంద్రం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) పేరుతో కొత్త చట్టం తీసుకురానుంది. ఇవాళ లోక్‌సభలో సభ్యులకు బిల్లు పేపర్లను పంపిణీ చేసింది. ఈ చట్టం కింద నైపుణ్యం లేని కార్మికులకు పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచనుంది.


