News February 6, 2025

ఉంగుటూరు: ఎలుకల మందు తాగిన వ్యక్తి.?

image

ఎలుకల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మానికొండకు చెందిన షేక్ మునీర్ మద్యానికి బానిసై ఎలుకల మందు వాటర్‌లో మిక్స్ చేసి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెజవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

Similar News

News February 6, 2025

ఉయ్యూరు వీరమ్మ తల్లి @ 500 ఏళ్ల చరిత్ర 

image

500 ఏళ్ల చరిత్ర గల వీరమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెదకడియం గ్రామంలో జన్మించి భర్త చింతయ్య హత్యకు గురికావడంతో సతీసహగమనం చేసింది. భర్త హత్యకు కారణమైన కరణం సుబ్బయ్య వంశం నిర్విర్యమైంది. ఉయ్యూరులో ఆమెకు ఆలయం నిర్మించి, ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఉయ్యాల ఊయింపు ప్రత్యేక సంప్రదాయం. లక్షలాది మంది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు. 

News February 6, 2025

కృష్ణాజిల్లా క్రీడాకారిణికి సీఎం ప్రశంసలు

image

కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన క్రీడాకారిణి గాయత్రీని CM చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం రాత్రి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ కాన్ స్లాలోమ్ మహిళా విభాగంలో గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా CM చంద్రబాబు గోల్డ్ మెడల్ సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

News February 5, 2025

ఉయ్యూరు: కాలువలో పడి వ్యక్తి మృతి

image

ఉయ్యూరు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సుందరయ్య నగర్‌కు చెందిన ఎడ్ల రాంబాబు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం కాలువ అరుగు పై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలంలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

error: Content is protected !!