News May 16, 2024

ఉంగుటూరు: ఓట్ల విషయంలో మహిళపై హత్యాయత్నం.?

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో దారుణం జరిగింది. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసిందని సంధ్యారాణిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత వర్గం తెలిపింది. ఓట్ల విషయంలో ఘర్షణ జరుగుతుండగానే.. ఈ మహిళను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏడుకొండలు ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి కాళ్లకు గాయాలు కాగా, గన్నవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను వల్లభనేని వంశీ పరామర్శించారు.

Similar News

News November 30, 2024

ఎన్టీఆర్ జిల్లాలో 4,600 మందికి ఉపాధి కల్పించాం: బీజేపీ

image

కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.

News November 29, 2024

‘ఫెంగల్’ తుఫానుపై APSDMA ఏం చెప్పిందంటే..

image

కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.

News November 29, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.