News March 1, 2025

ఉంగుటూరు: బర్త్ డే రోజు వాహనం ఢీకొని యువకుడు మృతి

image

జాతీయ రహదారి కైకరం వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు దుర్మరణం మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడు భీమడోలు మండలం పూళ్ళ గ్రామానికి చెందిన తులసీరాం(17).. తన పుట్టిన రోజు సందర్భంగా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఏలూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 4, 2025

కృష్ణా: LLM 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో LLM 2వ సెమిస్టర్ (2024-25 విద్యాసంవత్సరం) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 26 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జులై 10 నుంచి 21 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://kru.ac.in/ ను సందర్శించవచ్చు.

News July 4, 2025

ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంతో స్పెషల్.. నెట్టింట చర్చ

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్‌తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్‌కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.

News July 4, 2025

అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.