News February 25, 2025

ఉంగుటూరు : వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్

image

ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం.. మండలంలోని గ్రామానికి చెందిన వివాహిత పెళ్లి వేడుక నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కలపాల కిరణ్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Similar News

News February 25, 2025

విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

image

వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

News February 25, 2025

కృష్ణా : గ్యాస్ ఏజెన్సీలకు డీఎస్ఓ హెచ్చరిక

image

దీపం-2 ప‌థ‌కం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌కు అద‌నంగా నగదు వ‌సూలు చేసినట్లు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు ర‌ద్దు చేస్తామని కృష్ణాజిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి హెచ్చరించారు. దీపం-2 ప‌థ‌కం అమ‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వే నివేదిక‌లు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్య‌లపై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌ మీటింగ్ హాలులో స‌మావేశం నిర్వహించారు.

News February 25, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్

error: Content is protected !!