News April 2, 2025
ఉంగుటూరు: వ్యక్తిపై గొడ్డలితో దాడి

ఉంగుటూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలి తో దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్యాయత్నం జరిగిందని సమాచారం. నారాయణపురం నుంచి వస్తుండగా జాతీయ రహదారి వద్ద మాటు వేసి గొడ్డలితో తలపై నరికినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని మోటార్ సైకిల్‌పై తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 3, 2025
ఎలమంచిలి, అనకాపల్లి మీదుగా స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈనెల మూడవ తేదీన ఎలమంచిలి, అనకాపల్లి మీదుగా చర్లపల్లి-విశాఖకు వన్ వే సమ్మర్ స్పెషల్ రైలు నడుపుతున్నట్లు రైల్వే శాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 8.15 గంటలకు ఈ రైలు చర్లపల్లిలో బయలుదేరుతుందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విశాఖ చేరుతుందన్నారు.
News April 3, 2025
8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.
News April 3, 2025
NTR: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో 2025 ఏప్రిల్ 5న నిర్వహించనున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాపడ్డాయి. 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 15న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.