News November 29, 2025
ఉంగుటూరు: సీఎం పర్యటనతో విసృత ఏర్పాట్లు

డిసెంబరు 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లమాడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు శనివారం చురుగ్గా జరుగుతున్నాయి. ఉంగుటూరు మండలం నల్లమాడులో హెలికాఫ్టర్ ల్యాండింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క సభా వేదిక, వాహనాల పార్కింగ్, టెంట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్లకు మహాదశ జరుగుతున్నది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News December 1, 2025
పింఛన్లు పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

పింఛన్లు పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్ల సొమ్ములను కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.


