News February 15, 2026
ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.
Similar News
News February 18, 2026
పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.
News February 18, 2026
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

గుంటూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం విద్యార్థులకు భోజనం పెడతారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి.
News February 18, 2026
పీఎఫ్ జమల్లో ఆలస్యం.. ఉపాధ్యాయుల ఆందోళన

గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల పీఎఫ్ బకాయిల జమ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. 2022లో జీతాల నుంచి కత్తిరించిన మొత్తాలు ఇంకా ఖాతాలకు చేరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నివేదికలలో స్పష్టత లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బదిలీల కారణంగా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే డీఏ బకాయిలు కూడా పూర్తిగా జమ కాలేదని వారు అంటున్నారు


