News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2025
HYD: MLC ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌కు లేఖ

శాసనమండలి ఎన్నిక్లలో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పోటీలో లేనందున, బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఆదివారం బీఆర్ఎస్ KCRకు ఈ మేరకు అధ్యక్షుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా పేర్కొంటూ బీసీ అభ్యర్థులకు మద్దతిచ్చి బీసీలపై తమ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు.
News February 24, 2025
అసెంబ్లీకి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
News February 24, 2025
KMR: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా నోడల్ అధికారి నాగేశ్వర్ రావు సోమవారం ‘Way2News’తో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 7,481 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 7,282 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారన్నారు. 97.34% హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు.