News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News July 4, 2025
అమలాపురం: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి ఎస్పీ కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News July 4, 2025
ఏలూరు: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
ఖమ్మం: ఆయిల్‌పామ్ సుంకంపై కేంద్రమంత్రికి తుమ్మల లేఖ

ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్రం మే 31న ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొస్తారని లేఖలో పేర్కొన్నారు.