News December 17, 2025

ఉండవెల్లి: పోలింగ్ సమయం పూర్తి.. భద్రత కట్టుదిట్టం

image

మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది ఫలితమే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా 68 గ్రామపంచాయతీలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు ఒంటిగంట దాటిన తర్వాత వెంటనే ప్రవేశాలను మూసివేశారు. సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అధికారులు. 144 సెక్షన్ అమల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా.

Similar News

News December 21, 2025

ఆర్మీ అధికారి ఇంట్లో ₹2 కోట్లు.. లంచం తీసుకుంటూ దొరికిన వైనం!

image

డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్‌లో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను లంచం తీసుకుంటుండగా CBI అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో ₹2 కోట్లకు పైగా క్యాష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావటంతో CBI రంగంలోకి దిగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఢిల్లీ, బెంగళూరులోని దీపక్ సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

News December 21, 2025

NIT పాండిచ్చేరిలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>NIT<<>> పాండిచ్చేరి 6 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్, స్టెనోగ్రాఫర్, Sr. టెక్నీషియన్, టెక్నీషియన్, Jr. అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitpy.ac.in

News December 21, 2025

ఉమ్మడి విశాఖ డూమా ఇంచార్జ్ పీడీగా రవీంద్ర

image

ఉమ్మడి విశాఖ జిల్లా డూమా ఇన్‌ఛార్జ్ పీడీగా రవీంద్ర ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా పనిచేసిన పూర్ణిమా దేవి వ్యక్తిగత కారణాల వల్ల 38 రోజులపాటు సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో డూమా ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్.రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.