News October 28, 2025
ఉండవెల్లి మండలంలో 38.9 మిల్లీమీటర్ల వర్షం

గద్వాల జిల్లాలో ముసురు పడింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉండవెల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 38.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ధరూర్‌లో 0.2, గద్వాల 1.3, మల్దకల్ 0.4, గట్టు 1.0, అయిజ 0.3, రాజోలి 2.8, వడ్డేపల్లి 1.3, మానవపాడు 13.8, అలంపూర్ 12.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో వర్షం కురవలేదు.
Similar News
News October 29, 2025
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావద్దు: కర్నూలు కలెక్టర్

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 -293903కు ఫోన్ చేయాలని సూచించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మరో 3రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 29, 2025
విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
News October 29, 2025
జిల్లాలో 1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్‌సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.


