News November 9, 2024
ఉండిలో మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులు
ఒక మహిళపై ఏడుగురు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉండి మండలంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తండ్రితో ఉంటోంది. పక్కింట్లో ఉండే యాకోబుతో పాటు మరో ఆరుగురు లైంగికంగా వేధిస్తున్నారని ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఉండి ఎస్సై నసీరుల్లా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 3, 2024
వ్యక్తి తలపై కత్తితో దాడి: ఎస్ఐ జయబాబు
టీ.నర్సాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన నత్త నాగరాజుపై డిసెంబర్ 2న గుమ్మల్ల స్వామి అనే వ్యక్తి కత్తితో తలపై తీవ్రంగా దాడి చేసినట్లు ఎస్ఐ జయబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. భూ వివాదాల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 3, 2024
ఏలూరు జిల్లాలో రూ.367.63 కోట్ల ధాన్యం కొనుగోలు
ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.367.63 కోట్ల విలువైన 159782.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 20,959 మంది రైతుల నుండి కోనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెం.18004256453 కు ఫోన్ చేయాలన్నారు.
News December 3, 2024
పెనుమంట్ర: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.