News January 5, 2026

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్

image

ఉండి పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను సోమవారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సందర్శించారు.
హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వాటిని తొలగించి ఉద్యానవనంలా తయారు చేయాలని సిబ్బందికి చెప్పారు. రోగులకు అందతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 9, 2026

ప.గో: మద్యం తాగి డ్రైవింగ్.. భారీ జరిమానా

image

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు తణుకు కోర్టు భారీ జరిమానా విధించింది. పెనుమంట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి గుత్తుల వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

News February 9, 2026

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా బాధితులకు విముక్తి కలిగించాలన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

News February 9, 2026

ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.