News October 23, 2025
ఉండి: మేడవరం వద్ద స్కూల్ బస్సు బోల్తా

ఉండి మండలం పెదపుల్లేరు శివారు మేడవరం వద్ద గురువారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వారిని తక్షణమే బయటకు తీసి, చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 23, 2025
PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News October 23, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్

కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై గురువారం వివిధ శాఖల జిల్లా అధికారంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయగా పర్యవేక్షణలో పరిష్కరించాలన్నారు. లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.