News October 12, 2025
ఉండి: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తాండేశ్వర్ స్వామి ఆలయానికి లీజులో ఉన్న రొయ్యల చెరువు వద్ద శనివారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బహదూర్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. చెరువులోని మోటారు ఆగిపోవడంతో దాన్ని పరిశీలించేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. నెలవారీ జీతానికి పనిచేస్తున్న యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 12, 2025
జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భీమవరంలో సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుల ప్రచారాన్ని 4 కేటగిరీలుగా విభజించి మూడు వారాలపాటు వివిధ వస్తువుల ప్రదర్శనలతో అవగాహన కలిగించే విధంగా ప్రచారాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.
News October 11, 2025
జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రకృతి సాగు ద్వారా పండించిన రుచికరమైన కూరగాయలను ప్రజలకు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయం ద్వారా పండించిన మేలైన కూరగాయలనే వినియోగించేవారమని కలెక్టర్ అన్నారు.
News October 10, 2025
జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు ఊతం: కలెక్టర్

జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపుతో వినియోగదారునికి మరింత ఊతం లభించిందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ ప్రయోజనంపై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించి, తగ్గింపు రేట్లను పరిశీలించారు.