News March 29, 2025
ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 31, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News March 31, 2025
సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 31, 2025
నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.