News March 30, 2025
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
Similar News
News April 1, 2025
ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.
News April 1, 2025
స్టేషన్‌ఘన్‌పూర్: ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ట్రాక్టర్ కొనివ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన బోధాసి సంతోష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ట్రాక్టర్ కొనివ్వమని అడగగా.. ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామన్నారు. దీంతో క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 1, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. జనగామ జిల్లా మహిళా మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.