News March 29, 2025

ఉగాది సుఖసంతోషాలతో గడుపాలి: ఎస్పీ

image

ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ శనివారం కోరారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఆయుషు, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News April 1, 2025

నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.

News March 31, 2025

మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం పైమాఘానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో కలిసి మొగిలీశ్వర స్వామి గుడికి బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరికి అక్కడికక్కడే చనిపోగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.

News March 31, 2025

చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

error: Content is protected !!