News September 5, 2025

ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించిన బెస్ట్ టీచర్ మన మిద్దె

image

గుడివాడ SPS హైస్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసే మిద్దె శ్రీనివాసరావు.. శ్రీనిసైన్స్ మైండ్ వెబ్‌సైట్ ద్వారా రూ.లక్షల విలువైన ప్రాజెక్టు వర్కు, స్టడీ మెటీరియల్‌ను ఫ్రీగా ఉపాధ్యాయులకు అందించారు. ఏ.కొండూరు (M) పోలిశెట్టిపాడుకు చెందిన ఆయన DSC(2000)లో ఎంపికై గుడివాడలో టీచర్‌గా చేరారు. 7,8,9 క్లాసుల పాఠ్యపుస్తకాల రూపకల్పనలో సైతం ఆయన పనిచేశారు. ఆయన సేవలకు 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది.

Similar News

News September 7, 2025

ఉల్లి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కలెక్టర్

image

మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి రైతులకు రూ.1200 ప్రకారం మద్దతు ధర లభిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉల్లి రైతుల నుంచి 11, 174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని, అలాగే 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

News September 7, 2025

ఇవాళ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చా?

image

ఇవాళ ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియాలోనూ స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మీరు ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది.

News September 7, 2025

సంగారెడ్డి: ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లాలోని హిందూ సంఘాల నాయకులు, యువత, గణేష్ మండపాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.