News October 30, 2024

ఉచిత ఇసుకపై YCP పోస్ట్‌.. స్పందించిన మంత్రి కొలుసు

image

నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని YCP పెట్టిన పోస్టుపై మంత్రి కొలుసు పార్థసారథి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో YCP దిట్ట అని చెప్పవచ్చన్నారు. ఎవరో తెలియక తమ వ్యాపారం కోసం పెట్టుకున్న బోర్డులను TDP, రాష్ర్ట ప్రభుత్వానికి ఆపాదించడం ఎంత వరకు సమంజసమన్నారు. YCP హయాంలో ఇసుక దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి మరిచిపోయారా’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News February 24, 2026

కృష్ణా: ప్రశాంతంగా ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 22,604 మంది విద్యార్థులకు గాను, 22,396 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళకుమారి తెలిపారు. 208 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

News February 24, 2026

కృష్ణా: మరి కాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు

image

కృష్ణా(D)లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3 సిట్టింగ్‌, 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News February 24, 2026

28న గన్నవరంలో జాబ్ మేళా

image

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.