News July 7, 2024
ఉచిత ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు సోమవారం నుంచి ఉచిత ఇసుక సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రజలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా చేసే ఇసుక నాణ్యతగా ఉండేటట్లు చూడాలన్నారు.
Similar News
News November 29, 2024
గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్
బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.
News November 29, 2024
రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
News November 29, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.