News August 16, 2025

ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ ఉండాలి: RTC DM

image

ప్రొద్దుటూరులో స్త్రీ శక్తి పథకం కింద RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు, లేదా డిజిటల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రొద్దుటూరు RTC డిపో మేనేజర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఫొటోస్టాట్ పేపర్లు, సెల్ ఫోన్‌లో ఫోటో తీసుకున్న చిత్రాలను అనుమతించరని ఆయన తెలిపారు. ఈ మేరకు మహిళా ప్రయాణికులు RTC కండక్టర్లు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 16, 2025

కడపకు ప్రథమ స్థానం

image

APSPDCL పరిధిలో కడప జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఆ సంస్థ సీఎండీ సంతోష్ రావు చేతుల మీదుగా కడప ఎస్ఈ రమణ ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, వాట్సప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు అందించారు.

News August 16, 2025

గండి క్షేత్రానికి వర్తించని ఫ్రీ బస్ పథకం

image

శ్రావణమాస 4వ శనివారం సందర్భంగా గండి అంజన్న క్షేత్రానికి ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. నిన్న ప్రభుత్వం స్త్రీ శక్తి(ఫ్రీ బస్) పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ ఆలయానికి వెళ్లేందుకు మహిళలు ఆసక్తి చూపారు. అయితే ఈ బస్సులపై ‘స్త్రీ శక్తి పథకం వర్తించదు’ అనే బోర్డు చూసిన మహిళలు నిరాశకు గురయ్యారు. స్పెషల్ బస్సులకు వర్తించదని RTC ముందే ప్రకటించింది. ఈ విషయం తెలియని మహిళలు నిరాశకు లోనయ్యారు.

News August 16, 2025

ప్రొద్దుటూరు జైలు నుంచి దొంగ పరార్

image

ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ మహమ్మద్ రఫీ శనివారం పరారయ్యాడు. ఇటీవల రాజుపాలెంలో పట్టపగలు దొంగతనం చేస్తూ అడ్డువచ్చిన ఇంటి యజమాని తల పగలగొట్టాడు. మూడు రోజుల క్రితం రాజుపాలెం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి అతను పరారయ్యాడు. కడప, కర్నూల్, అనంతపురం తదితర జిల్లాల్లో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.