News February 28, 2026
ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
Similar News
News March 1, 2026
ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్‌కు IRGC వార్నింగ్

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. తమ నాయకుడి మరణానికి బాధ్యులైన ఆ దేశాలకు కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. కాగా IRGC ఇరాన్ శక్తిమంతమైన దళాలలో ఒకటి. ఇరాన్ తొలి సుప్రీంలీడర్ ఖొమైనీ స్థాపించిన ఈ IRGCని ఖమేనీ తిరుగులేని శక్తిగా మలిచారు. దీని సాయంతోనే ఇరాన్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
News March 1, 2026
44 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ద్వారా 44 పోస్టుల భర్తీకి UPSC దరఖాస్తులు కోరుతోంది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in
News March 1, 2026
ఏటి సూతకంలో నిత్యపూజ చేయవచ్చా?

ఏటి సూతకంలో ఉంటే ఇంట్లో పూజ చేయకూడదని చాలామంది పొరపడుతుంటారు. కానీ నిత్యపూజ తప్పనిసరిగా చేయాలంటున్నారు పండితులు. ‘దీపం పెట్టని ఇల్లు స్మశానంతో సమానం. కాబట్టి, దేవుడి పటాలకు గంధం, పుష్పం, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దంపతులు కలిసి నిత్యపూజలో కూర్చున్నా ఎలాంటి దోషం ఉండదు. నిత్యం భగవంతుని స్మరిస్తే మంచి జరుగుతుంది. ఆ పుణ్య ఫలాన్ని పితృదేవతలకు ధారపోస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది’ అంటున్నారు.


