News April 25, 2025
ఉచిత DSC కోచింగ్: మంత్రి సవిత

BC స్టడీ సర్కిల్ ద్వారా అన్ని వర్గాల డీఎస్సీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆన్‌లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను మంత్రి ప్రారంభించారు. శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఆచార్య యాప్ ద్వారా ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 25, 2025
HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.
News April 25, 2025
శిథిలావస్థలో హైదరాబాద్ చారిత్రక సంపద

పాతబస్తీలోని పురాతన భవనం పత్తర్‌గట్టి భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత నెలలో పెచ్చులూడి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1911లో నిర్మించిన ఈ హెరిటేజ్ భవన సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని స్థానికులు చెబుతున్నారు. చార్‌కమాన్ల ఆధునీకరణలో భాగంగా 2009లో కేవలం రెండింటికి మాత్రమే మరమ్మతులు చేశారని తెలిపారు. HYD చారిత్రక సంపదను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.
News April 25, 2025
లింగాల: పడిపోయిన అరటికాయల ధరలు.. ఆవేదనలో రైతులు

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.